స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, వైసీపీ, సీపీఐఎంతో పాటు స్వతంత్ర అభ్యర్థులపై దాడులు జరిగినట్లు డీజీపీ పేర్కొన్నారు. మొత్తం 13 జిల్లాల్లో 31 ఎన్నికల సంబంధిత ఘటనలు చోటుచేసుకోగా, వీటిలో 22 ప్రత్యక్ష హింసాత్మక ఘటనలు, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించి మరో 9 ఘటనలు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేయగా, మరో 11 ఘటనల్లో కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.