చైనాలోని టిబెట్‌లో గురువారం రాత్రి 7.0 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జడ్) తెలిపింది. ఉత్తర టిబెట్‌లోని నగ్కు ప్రాంతంలోని ఓ కౌంటీలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10.33 గంటలకు భూకంపం సంభవించినట్లు చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్స్ తెలిపింది. స్థానిక ప్రాంతంలో భూకంప ప్రకంపనలు స్పష్టంగా అనిపించినట్లు పేర్కొంది. టిబెట్ రాజధాని లాసాకు భూకంప కేంద్రం సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది.