వాట్సప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌కు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే సిమ్ లేని ఫోన్లలో ఆయా యాప్స్ పనిచేయవన్నమాట. మొబైల్ నంబర్లను ఉపయోగించి చేసే సైబర్ నేరాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం యాప్ ఇన్స్టలేషన్ సమయంలోనే సిమ్‌కార్డును ధ్రువీకరించుకుంటున్నారు. ఆ తర్వాత డివైజ్ నుంచి సిమ్‌కార్డును తొలగించినా, డీయాక్టివేట్ చేసినా సేవలు మాత్రం కొనసాగుతున్నాయి.