మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ ఏకంగా ఐదేళ్ల తర్వాత తొలిసారిగా లండల్లో ఉంటున్న తన కుమారుడితో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. మయన్మార్లో 2021లో సైనిక తిరుగుబాటు తర్వాత నిర్బంధంలోకి వెళ్లిన సూకీకి, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు. ఇన్నాళ్లకు తన తల్లితో మాట్లాడే అవకాశం లభించిందని కిమ్ అరిస్ సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. ఐదేళ్ల తర్వాత ఆమె గొంతు మళ్లీ వినడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.