సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం తీవ్ర కలకలం రేగింది. హైడ్రా సంస్థలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన ప్రాథమిక ఈవెంట్లకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం ప్రాంగణంలో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. హైడ్రా పరిధిలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) విభాగంలో 100 అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు.. మొత్తంగా 150 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది ఈ సమాచారంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు ఒక్కసారిగా స్టేడియం వద్దకు చేరుకున్నారు.