తన సుదీర్ఘ కెరీర్లో తెలుగు
తేజం పీవీ సింధు తొలిసారి జపాన్ ఓపెన్ సెమీస్కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో జపాన్ స్టార్ ప్లేయర్ నొజుమి ఒకుహరతో పీవీ సింధు తలపడాల్సి ఉంది. కానీ, ఒకుహర వైదొలగడంతో సింధుకు వాకోవర్ లభించింది.
ఇప్పటి వరకు జపాన్ ఓపెన్లో సెమీస్ కు చేరుకోలేకపోయింది. ఇప్పుడు సెమీస్లో ఒలింపిక్ ఛాంపియన్ చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడనుంది. అలాగే 15 ఏళ్ల తర్వాత భారత మహిళా షట్లర్ జపాన్ ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్ కు చేరుకోవడం గమనార్హం.