తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు. “తెలంగాణ దారి దీపం, తెలంగాణ జ్ఞాన సూత్రం జయశంకర్ సార్” అంటూ కొనియాడారు. ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది’ అనే చందాన జయశంకర్ సార్ జీవితం చివరి శ్వాస వరకు సాగిందని స్మరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జయశంకర్ సార్ అని కేటీఆర్ పేర్కొన్నారు.