అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అంటూ వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వార్తలను నమ్మొద్దని తెలిపింది. ఇలాంటి ధ్రువీకరించని వార్తలను, అసత్య ప్రచారాలను దయచేసి ఇతరులతో పంచుకోవద్దని కోరింది.