దక్షిణ థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గోలోక్ ఎఫ్ఏ కప్-2026 సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా, హఠాత్తుగా మైదానంలో పిడుగు పడింది. ఈ విషాదకర ఘటనలో సోఫ్వాన్(24) అనే ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి చెందగా, మరో 12 మంది ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మ్యాచ్‌కు ముందు భారీ వర్షం కురిసిందని స్థానికులు చెబుతున్నారు. వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ నిర్వహించామని, ఇలా హఠాత్తుగా పిడుగు గ్రౌండ్ లో పడుతుందని ఊహించలేకపోయామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.