తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రెండు గంటలుగా సాగుతున్న కేబినెట్ భేటీలో పలు అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పాఠశాలలతో సమానంగా జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సైతం ప్రతిరోజూ ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం), పాలు అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2027 గోదావరి పుష్కరాలకు రూ. 1000కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.