అనకాపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణం పలు మండలాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా గాలి బీభత్సం, అకాల వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఈదురుగాలులకు పాయకరావుపేట మండలం సత్యవరంలో కొబ్బరిచెట్టు కూలి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతిచెందారు. నక్కపల్లిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లావ్యాప్తంగా గాలివానకు పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది.