కింగ్ అక్కినేని నాగార్జున ANR వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటితో (మే 23) హీరోగా విజయవంతంగా 40 ఏళ్ల అరుదైన సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. నా తండ్రి లెజెండరీ ఏఎన్నార్ గారి చివరి చిత్రం ‘మనం’ 2014లో మే 23వ తేదీ, 1986 మే 23న నా మొదటి చిత్రం ‘విక్రమ్’ విడుదలైంది. మీ అందరినీ అలరించే, మీ ఆశీర్వాదాలను పొందే అదృష్టం నాకు దక్కింది. ఇన్నేళ్లుగా నా వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.” అని నాగ్ పేర్కొన్నారు.