కృత్రిమ మేధ(AI) విషయంలో అప్రమత్తంగా లేకపోతే తీవ్రమైన పరిణామాలు, సంక్షోభాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్ కంపెనీ ఆంథ్రోపిక్ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ హెచ్చరించారు. ఎఐపై సంసిద్ధతకు మొగ్గుచూపకపోతే కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధం కాకపోవడం లాంటిదేనని అభివర్ణించారు. మానవులకు మించిన సామర్థం ఉన్న కృత్రిమ మేధను ఎదుర్కొనకపోతే ఎఐ టెక్నాలజీ నుంచి పెను ముప్పు పొంచివుందని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.