కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డర్ల నుంచి స్క్వేర్ ఫీట్‌కు రూ.200 చొప్పున ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని హైదరాబాద్‌లో ఏ బిల్డర్‌ను లేదా డెవలపర్‌ను అడిగినా ఈ ట్యాక్స్ నిజమని చెప్తారన్నారు. “బడా భాయ్ మోదీ, అమిత్ షా తరచూ హైదరాబాద్ వచ్చి రేవంత్, రాహుల్‌లపై ఆరోపణలు చేస్తారు. కానీ నా మాటలు గుర్తుపెట్టుకోండి..ఈ ఆర్ఆర్ ట్యాక్స్‌పై ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే బడా భాయ్ (మోదీ) తన ఏబీవీపీ ఛోటా భాయ్ (రేవంత్ రెడ్డి) పై ఎప్పటికీ చర్యలు తీసుకోరు” అని కేటీఆర్ ఆరోపించారు.