ఆసుపత్రిలో ఉన్న తన సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్న ప్రముఖ నటుడు రజనీకాంత్ గురువారం బెంగళూరులో పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం సత్యనారాయణరావు ఇంట్లోని మెట్లపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను బెంగళూరులోని రాష్టోత్థాన ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రజనీకాంత్ గురువారం చెన్నై నుంచి బెంగళూరుకు వచ్చారు. ప్రస్తుతం తన అన్నయ్యకు నిపుణులైన వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.