ఏపీ గ్రూప్-1 పరీక్షల స్కామ్ పై ఈడీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని ఈడీ వెల్లడించింది. ప్రైవేటు సంస్థలకు రూ.1.14 కోట్లు చెల్లింపులు జరిగినట్లు తెలిపింది. ఈ కేసులో భాగంగా క్యామ్ సైన్ మీడియా సహా పలు సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, మనీలాండరింగ్ నెట్ వర్క్ కు సంబంధించిన ఆధారాలను సేకరించింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ కార్యదర్శి సీతారామాంజనేయులు నివాసంలోనూ తనిఖీలు చేపట్టి డిజిటల్ పత్రాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.