యూరప్‌లో వరుస బాంబు బెదిరింపులు విమానయాన సంస్థలు, ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. పలు విమానాలకు ఇవాళ (గురువారం) బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కొన్నింటిని దారి మళ్లించగా.. మరికొన్నింటిని అత్యవసరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేశారు. బెదిరింపులు వచ్చిన ఎయిర్‌లైన్స్‌లో విజ్ ఎయిర్, ఏరో లింగస్, లాట్ పోలిష్ ఉన్నాయి.డబ్లిన్ నుంచి రోమ్కు వెళ్తున్న ఏరో లింగస్కు చెందిన ఎయిర్‌బస్ A320 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఫ్రాన్స్‌లోని ఎవ్రూ సైనిక వైమానిక స్థావరానికి దానిని మళ్లించారు.