తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చిన గవర్నర్కు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లిన ఆయన శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం గవర్నర్కు స్వామివారి ప్రసాదాలను అందించారు.