హర్యానాలోని సోనిపట్‌లో ఆరు నెలల పసిపాపపై ఓ పిట్‌బుల్ కుక్క అత్యంత క్రూరంగా దాడి చేసింది. పెంపుడు కుక్కల యజమానుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడే జంతు ప్రేమికులంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. రష్మి గౌతమ్ స్పందిస్తూ ”ఆ పిట్‌బుల్ కుక్కకు తప్పకుండా కఠినమైన శిక్ష పడుతుంది. కానీ దాని యజమానుల సంగతేంటి? దానికి సరైన శిక్షణ ఇచ్చారా? తగినంత వ్యాయామం చేయించారా?. మీరు తుపాకీని కుక్క వైపు గురిపెట్టాలనుకుంటే, అదే తుపాకీని దాని యజమానుల వైపు కూడా గురిపెట్టాలి.