ఆసియా క్రీడల్లో అథ్లెట్లకు మెరుగైన వసతులు లేకపోవడం తీవ్ర సమస్యగా మారుతోంది. సర్దుకుపోదాంలే అనుకుంటూ నగోయలో అడుపెట్టిన క్రీడాకారులకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసియాడ్‌లో పతకాల వేటకు వెళ్లిన భారత షూటర్లకు కష్టాలు స్వాగతం పలికాయి. జపాన్‌లో కాలుమోపిన రోజే రవాణా సౌకర్యం ఆలస్యం కారణంగా వీధుల్లో నిరీక్షించారు మన షూటర్లు. అంతేకాదు వసతుల కొరత, శిక్షణకు అంతరాయం వంటివి భారత బృందానికి సవాల్ విసురుతున్నాయని ఎన్డీటీవీ కథనం పేర్కొంది.