నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామ శివారు మహాత్మ జ్యోతిబాపూలే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి భరత్ స్వగ్రామంలోని ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం భరత్ తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి విద్యార్థికి సంబంధించిన పెట్టే వస్తువులు తీసుకెళ్లేందుకు రాగా భరత్ చనిపోయిన విషయం తెలియడంతో తోటి విద్యార్థులు అవాక్కయ్యారు. ఉపాధ్యాయులు వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.