తన అనర్హతకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తాను పూర్తిగా గౌరవిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. “ఎన్నికల్లో పోటీ చేయడం నాకు కొత్తేమీ కాదు, అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం” అని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.