రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ప్రయోజనాలు ఎందుకని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లోని క్రీమీ లేయర్ మినహాయింపులపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యాపరమైన, ఆర్థికపరమైన సాధికారత వచ్చినప్పుడు, సమాజంలో సామాజిక హోదా దానంతట అదే మారుతుందని ధర్మాసనం పేర్కొంది.