తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో సోమవారం పెరంబూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ ఎంవీ కరుప్పయ్య సీఎం విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనతరం డీఎంకే శాసనసభాపక్ష నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా, అలాగే మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కే పళనిస్వామి, డీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వం కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

