దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,310 దిగివచ్చింది. వెండి ధర కూడా కిలోకు రూ.2,160 తగ్గింది. హైదరాబాద్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,680గా ఉంది. శుక్రవారం రూ.1,310 తగ్గి రూ.1,41,370కు చేరింది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు తదితర నగరాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,28,150గా నమోదైంది.