దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారింది. గాలిలో పీఎం2.5 కాలుష్య కణాల సాంద్రత 24 గంటల్లోనే రెండింతలకు పైగా పెరిగి, జాతీయ సురక్షిత ప్రమాణం కంటే నాలుగు రెట్లు అధికంగా నమోదైంది. దట్టమైన పొగమంచు, పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాల దహనం నుంచి వెలువడుతున్న పొగ కలిసి నగరాన్ని విష వాయువుల కోరల్లోకి నెట్టాయి ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో అత్యధికంగా ఏక్యూఐ 414గా నమోదైంది. ఘజియాబాద్- 377, నోయిడా-369, గురుగ్రామ్-349గా గాలి నాణ్యత సూచిక నమోదైంది.

