యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అదుపుతప్పిన ఒక భారీ ట్రక్కు రద్దీగా ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో పాటు మంటలు చెలరేగిన ఈ దుర్ఘటనలో పలువురు భారతీయ పౌరులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫుజైరా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్డుపై అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ భయానక ప్రమాదం సంభవించింది.

