హైదరాబాద్ లోని ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అపరిశుభ్రత, తీవ్ర స్థాయి నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఏడు KFC మరియు రెండు Domino’s Pizza ఔట్లెట్ల FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేశారు. స్టోరేజ్ ఏరియాల్లో పరిశుభ్రత లోపాలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు అధికారులు తేల్చారు. వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు విపరీతంగా తిరుగుతుండటం, ఎలుకల వ్యర్థాలు కనిపించడం, గోడలపై ఫంగస్, జిడ్డు పట్టిన వంట సామాగ్రి వంటి తీవ్ర ఉల్లంఘనలను గుర్తించారు.