వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల్లోనే ఓ రెండు నెలల పసికందు అనూహ్యంగా మృత్యువాత పడిన విషాద ఘటన ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం పోచారంలో చోటుచేసుకుంది. అప్పటివరకు ఉత్సాహంగా ఉన్న చిన్నారి మృతి చెందడంతో, టీకా వికటించడం వల్లే ఇలా జరిగిందా? అనే కోణంలో వైద్యాధికారులు విచారణ చేపట్టారు. బుధవారం గ్రామంలో ఏఎన్ఎం ద్వారా చిన్నారికి పెంటావాలెంట్, రోటా వైరస్, ఓపీవీ, పీసీవీ టీకాలను వేయించారు. అదే రోజు ఎఫ్ఐపీవీ టీకా కూడా ఇచ్చారు.అయితే,
గురువారం సాయంత్రానికి చిన్నారి పరిస్థితి విషమించి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయింది.