భారత్-చైనా సరిహద్దుల వద్ద అరుణాచల్ ప్రదేశ్లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కురుంగ్ కుమే జిల్లాలోని పార్సీ పార్లో అనే ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. 20 నివాసాలు అగ్నికి బూడిదయ్యాయి. అంతేకాకుండా భారీగా ఆస్తినష్టం కూడా వాటిల్లింది. తమ ఇళ్లు కాలిపోవడంతో పలు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి కారణం తెలియరాలేదని చెప్పారు.

