రాప్తాడు ఘటనలో స్నేహితురాల్ని రక్షించడానికి సాహసం చూపిన విద్యార్థిని లక్ష్మికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థికసాయం అందించారు. విద్యార్థిని లక్ష్మి కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించారు వైఎస్ జగన్. రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. లక్ష్మి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వైఎస్సార్సీపీ తరఫున రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు.