తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసే దిశగా జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029లో జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ సంస్థాగత నిర్మాణంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే పార్టీకి చెందిన పాత కమిటీలు, ఇన్ఛార్జుల పదవులను రద్దు చేస్తూ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 2వ తేదీకి ముందు నియమించిన పలు ముఖ్యమైన విభాగాలను మరియు కమిటీలను జనసేన రద్దు చేసింది.