రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ నాలుగు ప్యాకేజీలుగా నిర్మించేలా ఇప్పటికే టెండర్లు పిలవగా, దాని స్థానంలో రెండు ప్యాకేజీల్లో నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ NH ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద అమరావతి ORR మొదలవుతుంది. అక్కడి నుంచి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చలివేంద్రపాలెం సమీపంలో NH-65 వరకు ORR 86 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా ఒక ప్యాకేజీగా ఉండనుంది. మిగిలిన 109.13 కిలోమీటర్లు మరో ప్యాకేజీగా ఉంటుంది. రెండో ప్యాకేజీలోనే కృష్ణా నదిపై రెండుచోట్ల కీలక వంతెనలు రానున్నాయి.

