ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజుల పాటు ఇంటి నుంచి పని చేయాలని, వాహనాల వినియోగాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఈ నిర్ణయాలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. ప్రతి సోమవారం మెట్రోడేగా పరిగణిస్తామని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ మెట్రోలో ప్రయాణిస్తారని ప్రభుత్వం తెలిపింది. వారంలో ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.