డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. గురు పూజోత్సవం సందర్భంగా ‘గురు పరిరక్షణ దీక్ష’ పేరుతో ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. “డీఎస్సీలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. అనర్హులు కూడా టీచర్లు అయ్యారు.. అనర్హులు పాఠాలు చెప్తే పిల్లల భవిష్యత్తు ఏంటి..?. అనర్హులను ఉద్యోగాల నుండి తప్పించాలి. సీబీఐ విచారణ జరిపితేనే నిజాలు బయటికి వస్తాయి. మంత్రి లోకేష్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. లోకేష్ రాజీనామా చేస్తేనే అన్యాయమైన వారికి న్యాయం జరుగుతుంది అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.