రాష్ట్రంలో కీలకమైన రెండో దశ జనగణనకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో సుమారు 90,000 మంది ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తామని, వారిని విధుల్లోకి నియమించాలని జనాభా లెక్కల విభాగం ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు డిసెంబర్ నాటికి మొత్తం సిలబస్‌ను పూర్తి చేయాలి. జనవరిలో మళ్లీ సంక్రాంతి సెలవులు ఉంటాయి. అనంతరం జనవరి 25 నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు జనగణన కోసం క్షేత్రస్థాయికి వెళ్లాలి. మార్చి 1 వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించొద్దని జనగణన విభాగం సూచించింది.