టోల్‌ప్లాజాల దగ్గర నివసించే ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. టోల్‌ప్లాజాకు ఇరువైపులా 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికుల కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చింది. కేవలం రూ.1,500 చెల్లించి ప్రత్యేక వార్షిక టోల్ పాస్ పొందేలా వెసులుబాటు కల్పించింది. నవంబర్ 1 నుంచి ఈ కొత్త టోల్ పాస్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ ప్రత్యేక పాస్ పొందాలంటే టోల్‌ప్లాజా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నట్లు సరైన అడ్రస్ ప్రూఫ్ చూపించాలి.