బహదూర్ పల్లిలో ఉన్న టెక్ మహీంద్రా ఐటీ కార్యాలయం ఎదుట గురువారం ఉదయం ఓ ఉద్యోగిని ధర్నాకు దిగారు. భావన అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఐటీ కంపెనీ నిబంధనల ప్రకారమే మూడు రోజుల పాటు సెలవు కావాలని యాజమాన్యానికి ముందస్తుగా సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు వెల్లడించారు. చిన్నారి ఆరోగ్యం బాగోలేదనే కనీస మానవతా కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోని మేనేజ్‌మెంట్, సెలవు మంజూరు చేయకపోగా ఆమెను విధుల్లోంచి తోలిగించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.