‘కాక్రోచ్ జనతా పార్టీ’ పిలుపు మేరకు శివాజీ పార్క్, చెంబూర్, ఆజాద్ మైదాన్ వంటి కీలక ప్రాంతాల్లో ఆందోళన బాట పట్టిన విద్యార్థులను బెదిరిస్తూ.. వారిపై అక్రమంగా మత్తుపదార్థాల కేసులు మోపుతానంటూ ఒక పోలీస్ డ్రైవర్ బెదిరింపులకు దిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ముంబై కాంగ్రెస్ విభాగం ఎక్స్ వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఆ వీడియోలో కనిపించిన సీనియర్ డ్రైవర్‌ను ప్రస్తుత పోస్టింగ్ నుంచి తొలగించి సస్పెండ్ చేశారు.