ఉద్రిక్త పరిణామాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన విడుదల చేశారు. యువత, విద్యార్థుల ప్రయోజనాలు, వారి సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూసే అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టబోమని హెచ్చరించారు. పేపర్ లీకేజీకి కారణమైన బాధ్యులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

