సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కీలక ప్రకటన చేశారు. తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ పేరు మీద.. ప్రతి సంవత్సరం ఎండి (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) చేసే ఒక విద్యార్థికి ఆర్థికంగా సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. యువ డాక్టర్లను ప్రోత్సహించేందుకు ముందడుగు వేశారు. ఇంగా హెల్త్ ఫౌండేషన్‌తో కలిసి టెండూల్కర్ ఫౌండేషన్ ఈ ఫెలోషిప్‌ను ఇవ్వనుంది. శ్రీనగర్‌లో క్లెప్ట్, క్రానియోఫేసియల్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ కోసం ఏటా ఎండి చేసే ఒకరిని ఎంపిక చేయనుంది.