యూత్ డిక్లరేషన్‌లో 24 హామీలు ఇచ్చారు.. ఒక్కటంటే ఒక్కటి అమలు కూడా చేయలేదని అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని డైలాగులు కొట్టారు.. 1000 రోజులు అయిపోయింది.. నిరుద్యోగులను నిండా ముంచిన లఫంగా పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోందన్నారు. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు.