ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ ‘హ్యాపీ టీచర్స్ డే’ శుభాకాంక్షలు చెప్పడం లేదని స్పష్టం చేశారు. నిజమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి తనకు బోధించేవాటిని ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉండాలని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయుడు చెప్పిన ప్రతి విషయాన్నీ గుడ్డిగా అనుసరించడం అసలైన విద్య కాదని, అది కేవలం లొంగిపోవడమేనని వ్యాఖ్యానించారు. ‘బోధన’ పేరుతో విద్యార్థులందరినీ ఒకే విధంగా ఆలోచించేలా, ఒకే మార్గంలో నడిపించడం సరైన పద్ధతి కాదన్నారు.