విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, శాప్ ఛైర్మన్, ఎండీకి వినతులు ఇచ్చేందుకు మెగా డీఎస్సీ టీచర్లు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలోనే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తూ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న స్పోర్ట్స్ కోటా టీచర్లు వాటిని ఖండిస్తూ పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ‘తమ సర్టిఫికెట్లు, మెడళ్లు నిజమైనవేనంటూ, ఇకనైనా నిజం తెలుసుకో – నిందలు మానుకో, ఆరోపణలు చేసే వారికి ఆధారాలు చూపిస్తామంటూ నినాదాలు చేస్తున్నారు.