జపాన్‌ను భారీ భూకంపం మరోసారి కుదిపేసింది. 7.1 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించడంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్‌లోని దక్షిణ కుమామోటో ప్రిఫెక్చర్‌లో ఇవాళ (మంగళవారం) 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) తెలిపింది. భూకంపం తర్వాత సముద్రంలో 3.28 అడుగుల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందంటూ జేఎంఏ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.