కలిసికట్టుగా పోరాడితే విజయం వరిస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వల్ల స్పష్టమైంది. కానీ విజయం ఎంత ముఖ్యమో వినయం కూడా అంతే ముఖ్యమని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ అన్నారు. గౌరవంతో, సంయమనంతో, బాధ్యతాయుతంగా సంబురాలు జరుపుకోవాలని సామాజిక కార్యకర్తలు, తన మద్దతుదారులను కోరారు. అయితే కొంతమందికి నేటి యువతరం భాష అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు. ఎవరేమనుకున్నా నేటి జెన్ జడ్ యువత ఇలాగే ఉంటుందని అన్నారు.