జమ్మూ కాశ్మీర్‌లో ప్రతిష్టాత్మకమైన అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో దాదాపు 39 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గందర్‌బల్ జిల్లాలోని హరిగనివాన్ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. గందర్‌బల్ జిల్లా గుండ్ ప్రాంతంలోని ఎస్-మోడ్ హరిగనివాన్ మలుపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం రహదారి పక్కకు జారి కందకంలో (లోయలో) పడిపోయింది.