ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే పోస్ట్ చేసిన వీడియోలను ఆయన అధికారిక ఫేస్బుక్ అకౌంట్ నుంచి అవి పోస్ట్ అయ్యాయి. వీటిని ఫేస్బుక్ మాతృసంస్థ మెటా పొరపాటున నిలిపివేసింది. అది పాక్షికమే అయినప్పటికీ.. వివాదానికి కేంద్రబిందువు అయింది. ఈ పరిణామాలపై తాజాగా మెటా స్పందించింది. సాంకేతికంగా చోటు చేసుకున్న లోపం కారణంగానే ఈ అపశృతి చోటుచేసుకుందని వివరణ ఇచ్చింది. తిరిగి కొద్దిసేపటికే ఆ వీడియోను పునరుద్ధరించినట్లు వివరించింది. ఈ ఎర్రర్ చోటు సంభవించినందుకు ప్రధాని మోదీకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పింది.