కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద చెన్నై-కోల్ కత్తా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, పక్కసీటులో ఉన్న అతని భార్యకు గాయాలయ్యాయి. మృతుడు రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యాసంస్థల నిర్వాహకుడు నున్నా సురేశ్ గుర్తించారు.బాధితులు ఇవాళ తెల్లవారుజామున విజయవాడ వైపు నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఘటన జరిగింది.