టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ పావలా శ్యామల కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, అర్ధరాత్రి 1.52 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.